
రోజంతా ఎదురుచూపులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు నేరుగా వారి వ్యక్తిగత మొబైళ్లకు మెసేజ్‌లు వస్తాయని ప్రకటించడంతో డీఎస్సీ–25కు ఎంపికై న అభ్యర్థులు ఆదివారం రోజంతా ఎదురు చూశారు. రాత్రి 10 గంటలైనా ఏ ఒక్కరికీ సమాచారం అందలేదు. మరోవైపు సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు సంబంధించి నగర శివారులో ఆలమూరు రోడ్డులోని బాలాజీ పీజీ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం నుంచి డీఈఓ అక్కడే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు ఇక్కడి అధికారులకు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై డైరెక్టరేట్ నుంచి స్పష్టమైన సమాచారం అందలేదు. రాత్రయినా స్పష్టత లేకపోవడంతో అమోమయం నెలకొంది. ఓవైపు మెరిట్‌లో మంచి ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు, మరోవైపు అధికారుల్లో టెన్షన్ పట్టుకుంది. సాంకేతిక సమస్యలు, ఇతర సమస్యల కారణంగా ఎంపికై న అభ్యర్థులకు మెసేజ్‌లు పంపలేకపోతున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చారు. ఆర్జేడీ ఆదేశాలతో సోమవారం జరగాల్సిన సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు ప్రకటించారు. తర్వాత రోజు (మంగళవారం) ఉండొచ్చని ఇక్కడి అధికారులు అంచనా వేస్తున్నా... సోమవారం దీనిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు
రాని మెసేజ్‌లు
డైరెక్టరేట్ నుంచి కూడా
స్పష్టమైన సమాచారం కరువు
నేటి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేసినట్లు డీఈఓ ప్రకటన