
పండ్ల తోటల్లో డ్రోన్ సర్వే
గార్లదిన్నె: పండ్ల తోటల్లో డ్రోన్ సర్వే నిర్వహించనున్నట్లు ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్ పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా గార్లదిన్నె మండలంలోని ముకుందాపురాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేశారన్నారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో గురువారం ఉద్యాన శాఖ, ఎఫ్‌పీఓలు, ఏపీఎంఐపీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని రైతులకు చేరువ చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. 17 బృందాలు ముకుందాపురంలో చీనీ తోటలను సందర్శించి జీపీఎస్ ట్రాకింగ్ చేస్తాయన్నారు. చీనీ తోటలకు ఆశించే చీడపీడలు, యాజమాన్య పద్ధతులపై ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించి రైతులకు సలహాలు, సూచనలు అందిస్తాయన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని ‘జూమ్’ ద్వారా ఏపీఎంఐపీ డైరెక్టర్ రఘునాథ్ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఫిరోజ్ ఖాన్, ఐటీ (ఇంటెలిజెన్స్) శ్రీహరి పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ మైక్రో ఇరిగేషన్ అధికారులు మధు, గణేష్, నాగార్జున, ఎఫ్‌పీఓలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పైలట్ గ్రామంగా ముకుందాపురం ఎంపిక