వివాహిత ఆత్మహత్య
ఉరవకొండ: స్థానిక శివరామిరెడ్డి కాలనీలో నివాసముంటున్న వివాహిత ఆదిలక్ష్మి(39) ఆత్మహత్య చేసుకుంది. 20 ఏళ్ల క్రితం వివాహమైన ఆమెకు భర్త హరిప్రసాద్‌తో పాటు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. జీపు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే హరిప్రసాద్ కొంత కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో ఆదిలక్ష్మి పలుమార్లు పద్ధతి మార్చుకోవాలని భర్తతో చెప్పినా మార్పు రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై మృతురాలి తండ్రి ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


