హెచ్చెల్సీలో వివాహిత మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

హెచ్చెల్సీలో వివాహిత మృతదేహం లభ్యం

Dec 25 2025 8:13 AM | Updated on Dec 25 2025 8:13 AM

హెచ్చెల్సీలో వివాహిత మృతదేహం లభ్యం

హెచ్చెల్సీలో వివాహిత మృతదేహం లభ్యం

బొమ్మనహాళ్‌: హెచ్చెల్సీలో గల్లైంతైన వివాహిత మృతదేహమై లభ్యమైంది. పోలీసులు తెలిపిన మేరకు... డి.హీరేహాళ్‌కు చెందిన వరలక్ష్మి (27)కి బొమ్మనహాళ్‌ మండలంలోని మైలాపురం గ్రామానికి చెందిన నవీన్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. మంగళవారం కర్ణాటకలోని రాంపురం పట్టణానికి దంపతులు ద్విచక్ర వాహనంలో వెళ్లి షాపింగ్‌ ముగించుకుని రాత్రి 8 గంటల సమయంలో మైలాపురం గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో చెర్లోపల్లి వద్ద హెచ్చెల్సీ బ్రిడ్జిపై బైక్‌ అదుపుతప్పి కిందకు పడింది. వెనుకన కూర్చొన్న వరలక్ష్మి నేరుగా వెళ్లి కాలువలో పడి నీటి ప్రవాహనికి కొట్టుకుపోయింది. నవీన్‌ నుంచి సమాచారం అందుకున్న వరలక్ష్మి అన్నదమ్ములు రమేష్‌, బసవరాజు, తల్లి నాగమ్మ అక్కడకు చేరుకుని కాలువ వెంబడి గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గొడిసెలపల్లి వద్ద నీటిలో తేలియాడుతున్న వరలక్ష్మిని గుర్తించి వెలికి తీసి, వెంటనే బళ్లారిలోని విమ్స్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అన్న రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డి.హీరేహాళ్‌ ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement