
అనంతపురం క్రైం: పోలీసు శాఖను లక్ష్యంగా చేసుకుని విసిరిన ‘సైబర్’ వలను అనంతపురం పోలీసులు ఛేదించారు. సూత్రధారి తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన మహిళని గుర్తించి, అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఎస్పీ అన్బురాజన్ ఫొటో ప్రొఫైల్‌గా ఉన్న వాట్సాప్ నుంచి ఇటీవల అనంతపురం వన్‌టౌన్, టూటౌన్, రూరల్, ఇటుకలపల్లి సీఐలకు చాటింగ్ చేశారు.
‘అర్జెంట్ పనిమీద ఉన్నాను. కొంత డబ్బు పంపించండి’ అని ఆ చాటింగ్ సారాంశం. ఈ నంబరు ఎస్పీది కాదని నిర్ధారణకు వచ్చిన తర్వాత వన్‌టౌన్ సీఐ రెడ్డప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ‘సైబర్’ వలను ఛేదించాలన్న ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా ఫేక్ కాల్, మెసేజ్ వచ్చిన ఫోన్ నంబర్ తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందినదిగా గుర్తించారు.
వెంటనే వన్‌టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం కోయంబత్తూరుకు వెళ్లి సైబర్ నేరానికి యత్నించిన విజయలక్ష్మి అనే మహిళను అనంతపురం తీసుకొచ్చి విచారణ అనంతరం అరెస్టు చేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో సైబర్ నేరాల వైపు పయనించినట్లు విజయలక్ష్మి పోలీసుల విచారణలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment