సాక్షి , అనకాపల్లి : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పరిధిలోని నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. జిల్లా పరిధిలోని మూడు రెవెన్యూ డివిజన్‌ల వారీగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి విడత ఎన్నికలు అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో నిర్వహించనున్నారు.రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించే ఈ ఎన్నికలకు గానూ సర్పంచ్ స్థానాలతో పాటు,వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు మొత్తం 45 గుర్తులను కేటాయించనున్నారు. మండలంలోని ఎంపీక చేసిన పంచాయతీలలో నామినేషన్లు స్వీకరించనున్నారు.
షెడ్యూల్ ఇలా...
ఈ నెల 13న ఎన్నికల నోటిఫికేషన్,ఈ నెల 15న ఎన్నికల అధికారి ద్వారా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.15వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ,18న నామినేషన్ల పరిశీలన,19న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్,20న అప్పీల్‌పై తీర్మానం,21న నామినేషన్లకు ఉపసంహకరణ,అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన,గుర్తుల కేటాయింపు ఉంటుంది.26న ఓటింగ్ అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ కూడా పోలింగ్ కేంద్రాల వద్దే చేపడతారు.27న రీపోలింగ్ అవసరమైన చోట నిర్వహించనున్నారు.
తొలి విడతలో...
అనకాపల్లి, బుచ్చియ్యపేట, చీడికాడ, చోడవరం, దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట, మునగపాక, పరవాడ, సబ్బవరం మండలాల్లో తొలివిడత ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలు ఉదయం నిర్వహించి, మధ్యాహ్నం కౌంటింగ్ చేపడతారు.
సమ్మిట్‌లో అధికారులు బిజీ...
జిల్లాకు చెందిన కీలక అధికారులంతా విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ – 2026 దృష్టి సారించారు. ఈ కారణంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశం కంటే సమ్మిట్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో వివరాలు సైతం తెలియని స్థాయిలో డివిజనల్ స్థాయి అధికార ఉండడం గమనార్హం.


