విశాఖస్పోర్ట్స్: హంగేరిలోని బుడాపెస్ట్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో తొమ్మిది రౌండ్లలో ఐదున్నర పాయింట్లు సాధించిన నగరానికి చెందిన ఎం.వి.రుత్విక్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో 69 ఫిడే రేటింగ్ పాయింట్లతో స్టాండర్డ్ గేమ్స్‌లో 2307 రేటింగ్‌కు చేరుకుని ఫిడే మాస్టర్(ఎఫ్‌ఎం) హోదా అందుకున్నాడు. అనుభవజ్ఞులైన మాస్టర్స్ రఫత్, అట్టిలా, లయోష్, డేవిడ్‌లపై మ్యాచ్‌లను డ్రా చేసుకోవడంతో ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. గతేడాదే కాండిడెట్ మాస్టర్ హోదాను సాధించిన రుత్విక్.. తన ఫిడే రేటింగ్‌ను మెరుగుపరుచుకుని ఏడాదిలోనే ఫిడే మాస్టర్ హోదాకు ఎదిగాడు. 2022లో అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో ఏకంగా 189 ఫిడే రేటింగ్ పాయింట్లు సాధించడం తన కెరీర్‌లో చక్కటి ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.


