ఉద్యాన పంటలతో ఆదాయం | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన పంటలతో ఆదాయం

Nov 13 2026 12:46 AM | Updated on Nov 13 2026 12:46 AM

రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న శాస్త్రవేత్త ప్రసాద్‌

నర్సీపట్నం: ఉద్యాన పంటలు, కూరగాయలు, పూల నర్సరీలు ద్వారా ఆదాయం సమకూరుతుందని, రైతులు వీటి సాగుపై దృష్టిసారించాలని కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త ఎన్‌.సత్తిబాబు సూచించారు. వ్యవసాయశాఖ ఆత్మ, జిల్లా వనరుల కేంద్రం సంయుక్తంగా రబీలో ప్రధాన పంటల యాజమాన్య పద్ధతులపై రైతులకు గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటలు లాభదాయకంగా ఉన్నాయన్నారు. అనంతరం శాస్త్రవేత్త వాన ప్రసాద్‌ మాట్లాడుతూ రబీలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. చిరుధాన్యాలు వేసుకోవచ్చున్నారు. ఏడీఏ శ్రీదేవి రైతులకు పలు సూచనలు చేశారు. ఏవోలు విజయలక్ష్మి, ఆత్మ బీటీఎం ఎం.లక్ష్మి కిషోర్‌, రైతుల సేవ కేంద్రం ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement