పోస్టర్‌ ప్రెజెంటేషన్‌ విభాగంలో ప్రథమస్థానం | - | Sakshi
Sakshi News home page

పోస్టర్‌ ప్రెజెంటేషన్‌ విభాగంలో ప్రథమస్థానం

Nov 13 2026 12:46 AM | Updated on Nov 13 2026 12:46 AM

విద్యార్థులను అభినందిస్తున్న దృశ్యం

పాయకరావుపేట : శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్‌ డిగ్రీ కళాశాల బీఎస్సీ జూవాలజీ విద్యార్థినులు విశాఖ లైఫ్‌ సైన్స్‌ సింపోజియం 2026 పోస్టర్‌ ప్రెజెంటేషన్‌ విభాగంలో ప్రథమ స్థానం సాధించినట్టు కళాశాల సంయుక్త కార్యదర్శి సిహెచ్‌.విజయ్‌ ప్రకాష్‌ తెలిపారు. పోస్టర్‌ ప్రెజెంటేషన్‌లో ప్రథమ సంవత్సర విద్యార్థినులు పి.రమ్య, వి.అను, పి.రోషిణి ప్రతిభ కనబరిచి విఖ్యాత వైరాలజీ ప్రోఫెసర్‌ హేమ చేతుల మీదుగా బహుమతిని, నగదు పురస్కారాన్ని అందుకున్నట్టు తెలిపారు. టీక్వాబ్సి నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థులు పాల్గొనగా తమ విద్యార్థులు ప్రథమ స్థానం కై వసం చేసువడం ఆనందదాయకమని తెలిపారు. విజేతలను కళాశాల కరెస్పాండెంట్‌ నరసింహారావు, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామకృష్ణారెడ్డి అభిందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement