రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలకు ఎంపిక

Oct 25 2026 1:05 AM | Updated on Oct 25 2026 1:05 AM

కె.కోటపాడు : ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థాయిలో జరిగిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) క్రీడా పోటీల్లో ఎ.కోడూరు విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన ఇచ్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 23న కొమ్మాదిలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌–17 అథ్లెటిక్స్‌ క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన లెక్కల ఉమ హడ్జిల్స్‌, హైజంప్‌లలో ప్రథమ స్థానం, తర్రా మధుశ్రీ 1500 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం, 3 కిలోమీటర్ల పరుగులో ద్వితీయ స్థానం సాధించారు. కిల్లి ప్రమోదిని ట్రిపుల్‌ జంప్‌లో ప్రథమ స్థానం, 800 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం, హైజంప్‌లో ద్వితీయ స్థానంలో నిలిచింది. అనకాపల్లి భార్గవి రేస్‌ వాక్‌ 3 కిలోమీటర్లలో ప్రథమ స్థానం, గట్రేడ్డి తేజ 100 మీటర్ల హడ్జిల్స్‌లో ద్వితీయ స్థానం, 200 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానంలో నిలిచారు. తాడి వైష్ణవి 400 మీటర్ల హడ్జిల్స్‌లో తృతీయ స్థానంలో నిలవగా, జి.మనోహర్‌ హైజంప్‌లో తృతీయ స్థానంలో నిలిచారు. జి.సాయిశంకర్‌ 400 మీటర్ల హడ్జిల్స్‌లో తృతీయ స్థానంలో నిలిచారు. అథ్లెటిక్స్‌ ఉత్తమ ప్రతిభ చూపిన ఈ 12 మంది ఎ.కోడూరు హైస్కూల్‌ విద్యార్థులు ఈ నెల 28 కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలలో శనివారం ఆయా క్రీడాకారులను ప్రధానోపాధ్యాయుడు ఎ.శేఖర్‌, ఫిజికల్‌ డైరెక్టర్లు కె.చిట్టిప్రసాద్‌, ఆర్‌.తమ్మునాయుడు, ఉపాధ్యాయుడు సూర్రెడ్డి బాబూరావు అభినందించారు.

అథ్లెటిక్స్‌లో శ్రీ ప్రకాష్‌ విద్యార్థి ప్రతిభ

పాయకరావుపేట : ఈ నెల 23న విశాఖ కొమ్మాదిలో పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన అథ్లెటిక్స్‌ పోటీల్లో శ్రీ ప్రకాష్‌ విద్యాసంస్ధలకు చెందిన ఇ.దుర్వేష్‌ అండర్‌–19 పరుగు పోటీల్లో 100 మీటర్ల దూరాన్ని కేవలం 12 సెకన్లలో పూర్తి చేసి ప్రథమ స్ధానాన్ని సాధించినట్టు సీనియర్‌ ప్రిన్సిపాల్‌ ఎం.వి.వి.ఎస్‌ మూర్తి తెలిపారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఈ నెల 27న కర్నూల్‌లో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న దుర్వేష్‌ను విద్యాసంస్థల అధినేత సిహెచ్‌.వి.కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్‌ప్రకాష్‌, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement