టీడీపీ, జనసేనకు షాక్‌ | - | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేనకు షాక్‌

Oct 25 2026 1:05 AM | Updated on Oct 25 2026 1:05 AM

● రెండు పార్టీల నుంచి భారీగా వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

మునగపాక, ఎస్‌.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో జనసేన, టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు పార్టీల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు.

మునగపాక: మండలంలోని పల్లపు ఆనందపురం జనసేన నాయకుడు అల్లవరపు రమణబాబు తన అనుచరులు 150 మందితో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్‌, పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు శోభ హైమావతి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆ నాయకులు మాట్లాడుతూ... మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు విసుగు చెందారని చెప్పారు. రమణబాబు మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయడంతోపాటు అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. పార్టీ మండల కన్వీనర్‌ ఆడారి అచ్చియ్యనాయుడు, జెడ్పీటీసీ అభ్యర్థి ఆడారి కమలప్రియ శ్రీకాంత్‌, మాజీ వైస్‌ ఎంపీపీ ముత్యాల భాస్కరరావు, చూచుకొండ మాజీ సర్పంచ్‌ దొడ్డి సూరప్పారావు తదితరులు పాల్గొన్నారు.

వంద మంది టీడీపీ కార్యకర్తలు చేరిక

ఎస్‌.రాయవరం: దార్లపూడిలో టీడీపీకి షాక్‌ తగిలింది. తాజా మాజీ సర్పంచ్‌ మర్లపల్లి సుభాషిణితో కలిసి 100 మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. అడ్డురోడ్డు క్యాంపు కార్యాలయం వద్ద శనివారం పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు పొలిపెద ఈశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు తమ పార్టీలో చేరారని జోగులు తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం కావడం తథ్యమన్నారు. వైఎస్సార్‌సీపీలో కష్టపడి పనిచేసేవారికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉంటుందని చెప్పారు. మైనం సంతోష్‌కుమార్‌, పోలిశెట్టి శివ, గంట్రెడ్డి సత్యనారాయణ, కశిరెడ్డి గోవింద్‌, ఆకారపు వెంకటరమణ తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ మండలాధ్యక్షుడు మధువర్మ, నాయకులు పోలిశెట్టి పెద ఈశ్వరరావు, కంచిమూర్తి శ్రీనివాసరావు, అద్దేపల్లి నూకునాయుడు, మాజీ జెడ్పీటీసీ కశింకోట నీలేంద్రరావు పాల్గొన్నారు.

పాయకరావుపేట: సత్యవరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు బోయిడి సత్తిరాజు శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు ఆయనకు కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మండల అధ్యక్షుడు గెడ్డమూరి శ్రీనివాసరావు, కోటవురట్ల మాజీ జెడ్పీటీసీ సిద్ధాబత్తుల ఉమాదేవి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు తమ్మిర్సి సత్యనారాయణ, కొంతం నరేష్‌, సత్యవరం ఎంపీటీసీ అభ్యర్థులు పాలపర్తి సతీష్‌, బోడపాటి నాగేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు కర్రి వీరబాబు, గూటూరు వెంకటేశ్వరరావు, గూటూరు దొరబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement