రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు వేచలం విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు వేచలం విద్యార్థులు

Oct 25 2026 1:05 AM | Updated on Oct 25 2026 1:05 AM

విద్యార్థులను, పీడీ లలితను అభినందిస్తున్న హెచ్‌ఎం వెంకటరావు

దేవరాపల్లి: అథ్లెటిక్స్‌ పోటీల్లో వేచలం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. కొమ్మాదిలో శుక్రవారం జరిగిన ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌లో హైస్కూల్‌కు చెందిన టి. కుశ్వంత్‌ 800 మీటర్లు, 1500 మీటర్ల రన్నింగ్‌లోను, కె. చైతన్యకుమార్‌ 5000 మీటర్ల వాక్‌(నడక) పోటీలో ప్రథమ స్థానంలో నిలిచారు. వీరిద్దరూ రాష్ట్ర పోటీలకు అర్హత సాధించారని హెచ్‌ఎం పి. వెంకటరావు తెలిపారు. వీరితోపాటు పీడీ రాళ్లపల్లి లతను హెచ్‌ఎం పి. వెంకటరావు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు శనివారం శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement