ఎన్నికల విధుల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

Oct 25 2026 1:05 AM | Updated on Oct 25 2026 1:05 AM

● అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలను వెంటనే నమోదు చేయాలి ● కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎన్నికల పరిశీలకుడు గోపాలకృష్ణ

తుమ్మపాల: ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తూ, ఎక్కడైనా అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్‌ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎన్నికల పరిశీలకుడు గోపాలకృష్ణతో కలిసి మైక్రో అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించారు. ఒక కేంద్రంలో ఎన్ని పోలింగ్‌ స్టేషన్లు ఉన్నా, ఆ కేంద్రానికి ఒకే మైక్రో అబ్జర్వర్‌ బాధ్యత వహిస్తారని తెలిపారు. అబ్జర్వర్లు పర్యవేక్షణకే పరిమితం కావాలని, పోలింగ్‌ సిబ్బందికి సూచనలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఉదయం 6.30 గంటలకే కేంద్రాలకు చేరుకుని, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సుల తనిఖీ, సీలింగ్‌ ప్రక్రియను పరిశీలించాలన్నారు. అక్రమాలు గుర్తిస్తే ఫొటోలు, వీడియోలతో ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులో సమాచారం అందించాలని సూచించారు. పోలింగ్‌ అనంతరం నివేదికను స్వీకరణ కేంద్రంలో సమర్పించాలని, రీపోలింగ్‌ నిర్ణయంలో అది కీలకమవుతుందని తెలిపారు. ఎన్నికల పరిశీలకుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ, మైక్రో అబ్జర్వర్లు వీలైతే పోలింగ్‌కు ముందురోజే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పీఎస్‌యూలు, బ్యాంకు ఉద్యోగులను ఈ విధులకు ఎంపిక చేసినట్టు తెలిపారు. సందేహాలుంటే అధికారులను సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, డీఆర్‌వో వై. సత్యనారాయణరావు, డ్వామా పీడీ నిర్మలాదేవి పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారంపై ఎంసీఎంసీ నిఘా

ఎన్నికల ప్రచారం, రాజకీయ ప్రకటనల పర్యవేక్షణకు జిల్లా సమాచార, పౌర సంబంధాల కార్యాలయంలో ఎంసీఎంసీ కేంద్రం, మీడియా రూమ్‌లను ఏర్పాటు చేసినట్టు నోడల్‌ అధికారి ఎస్‌.వి. రమణ తెలిపారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు ఎన్నికల ప్రచారానికి సంబంధించి వార్తలు, ప్రకటనలు, వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రచార అంశాలను పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. ప్రకటనల ధ్రువీకరణ, ఎన్నికల వ్యయానికి సంబంధించిన ప్రచార అంశాల గుర్తింపు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పర్యవేక్షణ చేపడతాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement