పకడ్బందీగా స్థానిక ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా స్థానిక ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లు

Oct 25 2026 1:05 AM | Updated on Oct 25 2026 1:05 AM

● కలెక్టర్‌ విజయకృష్ణన్‌

యలమంచిలి రూరల్‌ : స్థానిక ఎన్నికల పోలింగ్‌ ప్రకియ పకడ్బందీగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. శనివారం యలమంచిలిలో మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్ల క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. మున్సిపల్‌ ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ పెట్టెల స్వీకరణ, స్ట్రాంగ్‌రూమ్‌ ఏర్పాట్ల గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. స్థానిక గురప్ప కల్యాణ మండపంలో పుర ఎన్నికల స్ట్రాంగ్‌రూమ్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఇండోర్‌ స్టేడియంలలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల స్ట్రాంగ్‌రూమ్‌లను ఆమె పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. అడ్డరోడ్డు ఆర్డీవో కె.వి.రామలక్ష్మి, తహసీల్దార్‌ వరహాలు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజు, పరవాడ డీఎస్పీ మోహన్‌రావు, యలమంచిలి సీఐ ధనుంజయరావు పాల్గొన్నారు.

నక్కపల్లిలో కౌంటింగ్‌ కేంద్రాల పరిశీలన

నక్కపల్లి : నక్కపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ కేంద్రాలను, బ్యాలెట్‌ బాక్సులు ఉంచిన స్ట్రాంగ్‌ రూములను జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ శనివారం పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్థానిక అధికారులకు వివరించారు. కౌంటింగ్‌ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. బ్యాలెట్‌ బాక్సులకు సీలు వేసే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో ఆర్‌డీఓ రామలక్ష్మి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement