సాక్షి, పాడేరు: డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న పాంగి చిరంజీవి(30) పేలుడు ప్రమాదంలో మృతిచెందడంతో పెదబయలు మండలం అడుగులపుట్టు పంచాయతీ జంగంపుట్టులో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ రోడ్డు పనులు ప్రారంభం నుంచి మినీ వ్యాన్ను ఆయనే నడుపుతున్నాడు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు ముగ్గురు భార్యలు, ఆరుగురు పిల్లలు ఉన్నారు. చిరంజీవి మృతితో కుటుంబమంతా వీధిన పడింది. అతని మృతితో వారంతా కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పెదబయలు పోలీసుల సమాచారంతో మృతదేహాన్ని భద్రపరిచిన అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి రాత్రికి చేరుకున్నారు.


