బాల్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ ఆఫ్‌ ఇండియాగా సాంబశివ | - | Sakshi
Sakshi News home page

బాల్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ ఆఫ్‌ ఇండియాగా సాంబశివ

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

నిర్వాహకుల చేతుల మీదుగా స్టార్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు అందుకుంటున్న సాంబశివ

రావికమతం : మండలంలోని టి.అర్జాపురం గ్రామానికి చెఽందిన పడాల సాంబశివ బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రిడలో స్టార్‌ ఆఫ్‌ ఇండియా అవార్డుకు ఎంపికయ్యాడు. దేశవ్యాప్తంగా బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల్లో ఐదుగురిని స్టార్‌ ఆఫ్‌ ఇండియాగా ఎంపిక చేయగా వారిలో ఏపీ నుంచి ఇద్దరు ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి టి.అర్జాపురం గ్రామానికి చెఽందిన పడాల సాంబశివతో పాటు నునపర్తికి చెందిన వీర్రాజు కూడా ఉన్నారు. శ్రీకాళహస్తిలో నిర్వహించిన 72వ సీనియర్‌ నేషనల్‌ మెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ 2026–27 క్రీడాపోటీలు జరిగాయి. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా పురుఽషుల విభాగంలో 33 జట్లు మహిళల విభాగంలో 28జట్లు పాల్గొన్నారు. ఏపీ నుంచి 10 మంది క్రీడాకారులతో కూడిన బాల్‌ బాడ్మింటన్‌ జట్టు పాల్గొంది. ఏపీ జట్టు మెరుగైన ప్రదర్శన ద్వారా ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లో సోమవారం ఆల్‌ ఇండియా రైల్వేస్‌ –ఏపి జట్లు తలపడ్టాయి. ఈ పోటీలో రైల్వేస్‌ ప్రథమ స్థానంలో నిలవగా, ఏపి జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులకు స్టార్‌ ఆఫ్‌ ఇండియాకు ఐదుగురిని ఎంపిక చేశారు. దీనిలో ఏపీ తరపున టి.అర్జాపురం హైస్కూల్‌కు చెందిన పడాల సాంబశివ ఉత్తమ ప్రతిభ చూపడంతో స్టార్‌ ఆఫ్‌ ఇండియాగా ఎంపికయ్యాడు. నిర్వాహకుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. అతనిని టి.అర్జాపురం హైస్కూల్‌ పీడీ రమేష్‌నాయుడు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement