●చోడవరం నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి చూసి ప్రయాణికులు చీదరించుకుంటున్నారు.
●బీఎన్ రోడ్డులో పెద్దపెద్ద గోతులు పడి చెరువులను తలపించేలా మారినా పాలకులు, ఆర్‌అండ్‌బీ అధికారులు చోద్యం చూడడంపై మండిపడుతున్నారు.
●బీఎన్ రోడ్డులో లోపూడి వద్ద కేబీ రోడ్డులో కందిపూడి వద్ద ఉన్న కల్వర్టులు కుంగిపోయి రంధ్రాలు పడి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
●కేబీ రోడ్డు నుంచి పెదమదీన, గున్నెంపూడి రోడ్డు, బుచ్చెయ్యపేట జంక్షన్ నుంచి కేపీ ఆగ్రహారం, పోలేపల్లి వెళ్లే రోడ్లు, కేబీ రోడ్డు నుంచి పి.భీమవరం, బీఎన్ రోడ్డు నుంచి గౌరీపట్నం వెళ్లే రోడ్డు గోతుల పడి రాకపోకలకు జనం తీవ్ర అవస్ధలు పడుతున్నారు.


