అనకాపల్లి నియోజకవర్గం | - | Sakshi
Sakshi News home page

అనకాపల్లి నియోజకవర్గం

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

●నియోజకవర్గంలోని ముఖ్యంగా తుమ్మపాల–మార్టూరు, మామిడిపాలెం, వెంకిపాలెం, కుంచంగి తదితర గ్రామాలకు వెళ్లే రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి.

●అనకాపల్లి మండలంలో మినరల్స్‌ ఫండ్స్‌తో చేపట్టే రోడ్లతో పాటు పలు శాఖల ద్వారా చేపట్లే రోడ్ల కాంట్రాక్టర్లపై తీవ్ర వత్తిడి తెచ్చి నిధుల్లో సగానికి పైగా వసూలు చేయడంతో రోడ్లు మరింత నాసిరకంగా తయారవుతున్నాయి.

●గత ఏడాది తుమ్మపాల నుంచి చోడవరం వరకు రోడ్డుపై గోతుల మరమ్మతులకు ఖర్చు చేసిన రూ.10 లక్షలు బుడిదలో వేసిన చందంగా యథావిధిగా గోతులు ఏర్పడ్డాయి.

●కశింకోట మండలంలో అచ్చెర్ల జంక్షన్‌ నుంచి అచ్చెర్ల గ్రామానికి వెళ్లే 3 కిలోమీటర్ల రోడ్డు, అక్కడి నుంచి మోసయ్యపేట, గోకివానిపాలెం గ్రామాలకు వెళ్లే కిలోమీటర్‌ పైగా రోడ్లు ఏళ్ల తరబడి గతుకులతో నిండి ఉన్నాయి. ఈ రోడ్ల పునర్నిర్మాణానికి సుమారు రూ.3.75 కోట్లు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇది జరిగి ఆరు నెలలు కావస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కాని దుస్థితి.

●ఉగ్గినపాలెం గ్రామానికి రోడ్డుకు రూ.85 లక్షలు మంజూరైనట్టు చెబుతున్నా దీనికి కూడా టెండర్‌ వేయడానికి ముందుకు రాని దుస్థితి. కన్నూరుపాలెం–తీడ శివారు కచ్చర్లపాలెం రోడ్డుకు సుమారు 3 కోట్ల నిధులు మంజూరైనా పనులు ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement