బురదమయంగా మారిన బోడిగరువు, నేరెళ్లపూడి మట్టి రోడ్డు దుస్థితి
●నియోజకవర్గంలో దేవరాపల్లి నుంచి వాలాబు వెళ్లే రోడ్డులో అడుగుకో గుంత, గజానికో గొయ్యి అన్న చందంగా మారింది.
●చింతలపూడి పంచాయతీ సమ్మెద నుంచి బోడిగరువు, నేరెళ్లపూడి గ్రామాలకు వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా మారింది. కాలిబాట సైతం లేని ఈ రెండు గ్రామాలకు గత ప్రభుత్వ హయాంలో అప్పటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసి సగం మేర మట్టి పనులు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా నేటికీ పూర్తి చేయలేదు.
●వీరభద్రపేట గ్రామానికి సుమారు రూ.84 లక్షలతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కాశీపురం నుంచి గవరవరం వరకు తారురోడ్డు విస్తరణకు గత ప్రభుత్వ హయాంలో అప్పటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు రూ.20 కోట్ల నిధులతో సగానికి పైగా పనులు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మిగిలిన కొద్దిపాటి పనులు చేయడానికి సాకులు చెబుతోంది.
●ఎం.అలమండ నుంచి మామిడిపల్లి గ్రామాలకు 4.5 కి.మీ మేర తారురోడ్డు నిర్మాణానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ. 2.80 కోట్లు మంజూరు చేసి అప్పట్లోనే పనులు ప్రారంభించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాళ్లు తేలి అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.


