మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందాలి | - | Sakshi
Sakshi News home page

మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందాలి

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

మునగపాక : బాలికలు, మహిళలు ఆత్మ విశ్వాసంతో వ్యవహరించాలని డీఈవో జి.జి.ఎస్‌ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మండలంలోని పాటిపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో రాణీ లక్ష్మీబాయి సెల్ఫ్‌ డిఫెన్స్‌ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల్లో అత్మవిశ్వాసం, ధైర్యం, భద్రత వంటి అంశాలపై మరింత అవగాహన కల్పించేందుకు శిక్షణ దోహదపడుతుందన్నారు. ప్రమాదకర పరిస్థితులను గుర్తించి తమను రక్షించుకునేందుకు అవసరమయ్యే నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. జిల్లా జీసీడీవో జమీమా, బండి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి చారి, అనకాపల్లి ఇన్‌చార్జి అప్పారావు, కరాటే కోచ్‌ శివ, హెచ్‌ఎం జి.ప్రమీల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం డీఈవో నాగేశ్వరరావును పలువురు ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement