ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 45 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 45 అర్జీలు

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

అర్జీదారుని సమస్య వింటున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి: స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 45 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఎస్పీ తుహిన్‌ సిన్హా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలోని సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. భూ తగాదాలు, ఆస్తి గొడవలు, ఆర్థిక మోసాలు, గృహ కలహాలు, శాంతిభద్రతలు, ఇతర విభాగాలకు చెందిన సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్‌.మోహన్‌రావు, సీఐ రమణయ్య, ఎస్‌ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement