●కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో కొత్తగా ఒక్క రోడ్డు వేసిన దాఖలాలు కనిపించడం లేదు.
●జాతీయ రహదారి నుంచి సారిపల్లిపాలెం మీదుగా చుక్కలవారి లక్ష్మీపురం, జానకయ్యపేట, చినతీనార్ల, పెదతీనార్ల, దొండవాక వెళ్లు రోడ్డు పెద్ద పెద్ద గోతులతో రెండేళ్ల నుంచి చాలా అధ్వానంగా ఉంది. ఇటీవల రోడ్డు పనులు ప్రారంభించినా పూర్తి చేయలేదు.
●వెదుళ్లపాలెంనుంచి సీతంపాలెం, రామకృష్ణాపురం నుంచి పెద దొడ్డిగల్లు, గుల్లిపాడు నుంచి రమణయ్యపేట మీదుగా రేబాక వెళ్లే రోడ్డు పరిస్థితి కూడా దయనీయం. పోలవరం కాలువ తవ్వకాల వల్ల రోడ్లు ఛిద్రమయ్యాయి.
●పెదదొడ్డిగల్లు, సీతంపాలెం గ్రామాలకు చెందిన విద్యార్థులు బోదిగల్లంలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే కాలినడక తప్పసైకిళ్లు, ఆటోలపై రాకపోకలు సాగించేందుకు వీలు లేని పరిస్దితి.
●పాయకరావుపేట పట్టణంలో మెయిన్‌రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించేందుకు శంకుస్థాపన చేశారు. 9 నెలలు పూర్తయినా విస్తరణ పనులు మందకొడిగా జరుగుతున్నాయి. నెలరోజులుగా పనులు నిలిచిపోయాయి.


