అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలి

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

● తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీపీఎం నిరసన

● తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీపీఎం నిరసన

కె.కోటపాడు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న సీపీఎం నాయకులు

కె.కోటపాడు: వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లా రైతులు నష్టపోయిన దృష్ట్యా ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి రొంగలి ముత్యాలనాయుడు కోరారు. అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ నాయకులు సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముత్యాలనాయుడు మాట్లాడుతూ అప్పులు చేసి వరినారు మడులను సిద్ధం చేశారని, వర్షాలు లేక అవి ఎండిపోవడంతో రైతులు అప్పులను మూటకట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రభుత్వం రైతులకు పంట నష్టం అందించడంతో పాటు ఉపాధి పని దినాలను 200 రోజులు కల్పించి రోజుకి రూ.600 వేతనం ఇవ్వాలని కోరారు. నాయకులు ఈర్లె నాయుడుబాబు, గండి నాయినిబాబు, గాడి ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement