సాక్షి, అనకాపల్లి : భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకూ నిర్వహిస్తున్న ‘పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అండ్ హ్యాస్ అనే నేను’ కార్యక్రమంలో జిల్లా ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. 30 సెకన్ల పాటు ‘అనే నేను’ వీడియోను దేశ ప్రగతికి మీ లక్ష్యాన్ని పేర్కొంటూ రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కోరారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి బాధ్యతను చాటేలా, తమ వంతుగా చేయగలిగే ఒక మంచి పనిని సంకల్పంగా స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. ఆగస్టు 14న నిర్వహించే రాష్ట్రవ్యాప్త మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. పాఠశాలల్లో ‘అనే నేను’ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాలను, దేశ నిర్మాణంలో తాము చేయాలనుకుంటున్న కృషిని వెల్లడించేలా ప్రోత్సహించాలని తెలిపారు.
వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసే సమయంలో PartnersInNationBuilding, # MyIndia MyVision, # IndependenceDay2026, # AneNenu హ్యాష్ ట్యాగ్‌లను ఉపయోగించి @APOfficialNews ట్యాగ్ చేయాలని తెలిపారు.


