నర్సీపట్నం: తిరుపతి వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీల్లో నర్సీపట్నం మున్సిపాలిటీ రామారావుపేటకు చెందిన యలమంచిలి పృధ్వి మణికంఠ ఛాంపియన్గా నిలిచాడు. ఆదిత్య ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పృధ్వి మణికంఠ 7వ తరగతి చదువుతున్నాడు. చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో ఈ నెల 14 నుండి 17వ తేదీ వరకు జరిగిన యానెక్స్, సన్రైజ్ ఏపీ రాష్ట్రస్థాయి అండర్–13 సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీల్లో పృధ్వి మణికంఠ సింగిల్స్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి ఛాంపియన్గా నిలిచాడు. డబుల్స్ విభాగంలో విశాఖ క్రీడాకారునితో కలిసి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించాడు. పలువురు బాలుడిని అభినందించారు.


