ఉద్యోగ భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత కల్పించాలి

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

● కాంట్రాక్టు ఉపాధ్యాయుల వినతి

● కాంట్రాక్టు ఉపాధ్యాయుల వినతి

చింతపల్లి: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. గురువారం చింతపల్లి వచ్చిన కార్యదర్శిని స్థానిక వైటీసీలో కలిసి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గత ఎనిమిది నెలలుగా జీతాలు అందక తమ కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్‌ జీతాలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరా రు. అదేవిధంగా భవిష్యత్తులో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల సమయంలో ప్రస్తుతం కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యా య పోస్టులను మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయిన కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు, తమ కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఉగ్రంగి రవిప్రసాద్‌, దేపూరి ఓంకార్‌, వండలం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement