మాదక ద్రవ్యాల నిరోధంలో యువత పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాల నిరోధంలో యువత పాత్ర కీలకం

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

● సీఐ సింహాచలం

● సీఐ సింహాచలం

చింతపల్లి: విద్యార్థి దశ నుంచే మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నాంది పలకాలని సీఐ సింహాచలం పిలుపునిచ్చారు. గురువారం స్థానిక డిగ్రీ కళాశాలలో ఈగల్‌ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాలపైనే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ వహించి, ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఎలాంటి దురలవాట్లకు లోనుకాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సాహితి, వైస్‌ ప్రిన్సిపాల్‌ రమణ, అధ్యాపకులు కె.జి.రాణి, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement