గంజాయి నిందితుడిపై పీడీ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి నిందితుడిపై పీడీ యాక్ట్‌

Nov 19 2026 12:55 AM | Updated on Nov 19 2026 12:55 AM

నక్కపల్లి: గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి జైలుకి పంపించినట్లు సిఐ మురళి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన పాత నేరస్తుడు అడ్డూరి ప్రసాద్‌ అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని అక్రమంగా సేకరించి అనకాపల్లి పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తూ ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాడు. నక్కపల్లి, నాతవరం తదితర పోలీస్‌స్టేషన్లలో ఇతనిపై పలు గంజాయి కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ తన ప్రవృత్తిని మార్చుకోలేదు. పలుమార్లు గంజాయి రవాణాకు పాల్పడుతుండడంతో ఎస్పీ తుహిన్‌ సిన్హా ప్రతిపాదన మేరకు అప్పారావుపై పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించడంతో అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగిందని మురళి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement