మొగలిపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న సబ్బవరపు భాను రోషినినాయుడికి రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నట్లు ప్రత్యర్థి అభ్యర్థి గురి సతీష్ ఆరోపిస్తున్నారు. ఆమె ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఎన్‌జేఎక్స్2363760, వరుస సంఖ్య 2694 ప్రకారం జీవీఎంసీ పరిధిలోని భీమిలి నియోజకవర్గం, 11వ వార్డు ఎండాడలోని వివేకానందనగర్‌లో ఓటరుగా నమోదై ఉన్నారని పేర్కొన్నారు. అదే చిరునామాతో ఆధార్ కార్డు 699657517457 కూడా ఉందని తెలిపారు. మరోవైపు మొగలిపురం గ్రామంలో 11వ వార్డులో ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఎక్స్‌జేవీ3557733, వరుస సంఖ్య 7474 ప్రకారం ఆమెకు ఓటు హక్కు ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో ఎండాడలోని ఓటు హక్కును వినియోగించుకున్న ఆమె.. ఇప్పుడు మొగలిపురం సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచారని సతీష్ తెలిపారు. ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండటంపై ఎన్నికల అధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మొగలిపురంలో నివాసానికి సంబంధించిన అర్హతలను కూడా పరిశీలించాలని కోరారు.


