రెండు చోట్ల ఓట్లు పెండింగ్‌ కేసుల దాచివేత! | - | Sakshi
Sakshi News home page

రెండు చోట్ల ఓట్లు పెండింగ్‌ కేసుల దాచివేత!

Nov 19 2026 12:55 AM | Updated on Nov 19 2026 12:55 AM

సబ్బవరం: పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కూటమి మద్దతుదారులు నిబంధనలను పక్కనపెడుతున్నారా? ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపుతున్నారా? సబ్బవరం మండలం మొగలిపురం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల్లో చోటుచేసుకున్న రెండు వివాదాలు ఇప్పుడు ఈ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఒక అభ్యర్థికి జీవీఎంసీ పరిధిలోనూ, మొగలిపురంలోనూ ఓటు హక్కు ఉండటం.. మరో అభ్యర్థి తనపై నమోదైన క్రిమినల్‌ కేసు వివరాలను నామినేషన్‌లో వెల్లడించలేదనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇద్దరూ కూటమి పార్టీల మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులేనని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎలాగైనా పంచాయతీ పీఠాన్ని దక్కించుకోవాలని ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మొగలిపురం పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల గోల్‌మాల్‌

ఒకరికి రెండు చోట్ల ఓటు హక్కు.. మరో అభ్యర్థి నామినేషన్‌లో క్రిమినల్‌ కేసు గల్లంతు

నకిలీ ధ్రువపత్రాలు, తప్పుడు ఎన్‌వోసీ సమర్పించారంటూ ఆరోపణలు

నిబంధనలకు తూట్లు.. ఆర్డీవోకు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యర్థి అభ్యర్థి సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement