వరుస చైన్‌ స్నాచింగ్‌లతో బెంబేలు | - | Sakshi
Sakshi News home page

వరుస చైన్‌ స్నాచింగ్‌లతో బెంబేలు

Nov 19 2026 12:55 AM | Updated on Nov 19 2026 12:55 AM

● వృద్ధులే లక్ష్యంగా చోరీలు ● ఒక్కరోజు వ్యవధిలో రెండు ఘటనలు ● వేంపాడులో వృద్ధురాలి మెడలో గొలుసు అపహరణ

నక్కపల్లి: మండలంలో వరుస చైన్‌స్నాచింగ్‌లతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఒక్కరోజు వ్యవదిలోనే రెండు పక్క పక్క గ్రామాల్లో రెండు చైన్‌స్నాచింగ్‌లు జరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మంగళవారం సాయంత్రం కాగితలో రోడ్డుపక్కన నిలుచున్న లక్ష్మి అనే వృద్ధురాలి మెడలో నుంచి మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు ఎత్తుకుపోయారు. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే వేంపాడులో కుమ్మరి వీధి వద్ద ఉన్న కిరాణాషాపు నిర్వహిస్తున్న డి.రమణమ్మ అనే వృద్ధురాలి మెడలో నుంచి 16 గ్రాముల బంగారు గొలుసును ఎత్తుకుపోయారు. ఒక్క రోజు వ్యవధిలో వృద్ధులే లక్ష్యంగా జరిగిన ఈ చైన్‌స్నాచింగ్‌ ఘటనలను ప్రజలను ముఖ్యంగా మహిళలు, వృద్ధులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డెక్కాలంటే భయపడాల్సిన పరిస్దితి ఎదరయింది. స్కూటీపై వచ్చిన 35 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు తన మెడలో ఉన్న బంగారు గొలుసును ఎత్తుకు పోయారంటూ బాధితురాలు తెలిపింది. ఇద్దరు యువకులు తెలుగులోనే మాట్లాడుకున్నారని తెలిపింది. పథకం ప్రకారమే చైన్‌ స్నాచింగ్‌ల ముఠా మండలంలో గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ చోరీలకు పాల్పడుతోందన్న ప్రచారం జరుగుతోంది. వేంపాడులో జరిగిన చైన్‌ స్నాచింగ్‌పై సీఐ మురళి వేంపాడు వెళ్లి ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement