కుంగిపోయిన పెంకుటిల్లు
మాడుగుల రూరల్: మండలంలోని కె.జె.పురం కాపువీధిలో నివసిస్తున్న నిరుపేద కోన కృష్ణ పెంకుటిల్లు ధ్వంసమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంటిపై భాగంలో సోమవారం తెల్లవారుజామున పెంకులు పూర్తిగా ఊడిపోయాయి. ఇంటి గోడలు కుంగిపోవడంతో తలదాచుకోవడానికి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. కోన కృష్ణకు భార్య తప్ప పిల్లలు లేరు. ఎటువంటి భూమి లేదు. ప్రతి నెలా వచ్చే సామాజిక పింఛను తప్ప మరో గత్యంతరం లేదు. నిరుపేద వృద్ధుల దీనస్థితిని గుర్తించి గూడు ఏర్పాటు కోసం దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మావనతా దృక్పథంతో సాయం చేసేవారు గ్రామస్తుడు ఆకుల రవికిరణ్‌కు చెందిన 9701542320 నంబరుకు ఫోన్ పే ద్వారా సహాయం అందించాలని బాధిత వృద్ధ దంపతులు కోరుతున్నారు.


