సీలేరు: గూడెంకొత్తవీధి మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ధారాలమ్మ అమ్మవారిని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సన్యాసినాయుడు మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జడ్జి దంపతులకు ఆలయ నిర్వాహకులు పోతురాజు గోవింద్, నాని, ఆలయ అర్చకులు నారాయణమూర్తి సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో జడ్జి దంపతుల పేరిట ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు జడ్జి సన్యాసినాయుడును దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి, ధారాలమ్మ అమ్మవారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.


