గూడెంకొత్తవీధి: దామణాపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వంతల కాసులమ్మ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, గ్రామస్తులు తరలివచ్చారు. ప్రజాసేవ చేయా లన్న సంకల్పంతోనే తాను వెలుగులో చేస్తున్న వీవోఏ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచానని కాసులమ్మ తెలిపారు. నామినేషన్ దాఖలు అనంతరం ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు వంతల అరుణ్‌కుమార్, రీముల బాలకృష్ణ, మువ్వల చిన్నబాయ్, పాతూను లక్ష్మణ్ తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.


