మునగపాక: రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో మునగపాక మండలం ఉమ్మలాడకు చెందిన పేకేటి బన్నీ రజత, కాంస్య పతకాలు కై వసం చేసుకున్నారు. ఉమ్మలాడకు చెందిన పేకేటి త్రినాఽథ్, చిన్ని దంపతుల కుమారుడు బన్నీ ఇటీవల కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీల్లో రజత, కాంస్య పతకాలు సాధించి ద్వితీయ స్థానం దక్కించుకున్నాడు. దీంతో ఆదివారం ఉమ్మలాడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూరిశెట్టి రామకృష్ణ(ఎస్‌ఆర్), పెద్దలు మొల్లేటి వాసు, మళ్ల కాలేశ్వరరావు, సూరిశెట్టి శ్రీనివాసరావు, పంపాన రుద్ర మురళీకృష్ణ తదితరులు బన్నీని సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, స్వగ్రామంతో పాటు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. మొల్లేటి వినోద్, పల్లె అప్పలనాయుడు, మొల్లేటి అచ్చియ్యనాయుడు, మహలక్ష్మినాయుడు, ఆటో శ్రీను తదితరులు పాల్గొన్నారు.


