అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌ | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

ప్రమాదంలో చోడవరం వాసి మృతి

అల్లిపురం: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ దరి డీఎల్‌వో జంక్షన్‌ సమీపంలోని అవుట్‌ గేట్‌ ఎదురుగా ఉన్న మలుపు వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిమ్మిటి లక్ష్మణరావు(29) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. శనివారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో లక్ష్మణరావు తన మేనల్లుడు శంకర్‌ సురందర వర్మతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి రైల్వే స్టేషన్‌ రోడ్డు మీదుగా కంచరపాలెం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. రైల్వే స్టేషన్‌ అవుట్‌ గేట్‌ ఎదురుగా ఉన్న మలుపు వద్దకు చేరుకోగానే.. బైక్‌ అదుపుతప్పి సెంటర్‌ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా.. బైక్‌ నడుపుతున్న లక్ష్మణరావు స్పృహ కోల్పోయాడు. వెనుక కూర్చున్న శంకర్‌ వెంటనే అంబులెన్స్‌ ఏర్పాటు చేసి అతడిని కేజీహెచ్‌కు తరలించాడు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజాము సుమారు 2.15 గంటల సమయంలో లక్ష్మణరావు మృతి చెందినట్లు విశాఖ టూ టౌన్‌ ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందింది. మృతుడు చిమ్మిటి లక్ష్మణరావు అన్నవరం వీధి, రామోహన్‌పేట, చోడవరం వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్పృహ కోల్పోయిన

చిమ్మిటి లక్ష్మణరావు

రోడ్డు ప్రమాదానికి గురైన బైక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement