పాడేరు : ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఈనెల 27న చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ టి.నిశాంతి మంగళవారం తెలిపారు. జాబ్‌మేళాలో పది ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. టెన్త్ నుంచి పీజీ ఆపై చదువులు పూర్తి చేసుకుని ఉపాధి, ఉద్యోగం లేని నిరుద్యోగ అభ్యర్థులు అర్హులని తెలిపారు. విద్యార్హత, నైపుణ్యం అధారంగా జాబ్‌మేళాలో పాల్గొని ఉద్యోగావకాశాలు పొందాలని సూచించారు. అనంతరం ఆమె జాబ్‌మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి. ప్రశాంత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


