● ఏడీఆర్ డాక్టర్ ఆదిలక్ష్మి
చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ డి.ఆదిలక్ష్మి తెలిపారు. ఈ నెల 26 నుంచి 30 వరకూ చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో 1.8 నుంచి 4.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 21.8 డిగ్రీల నుంచి 22.6 డిగ్రీల మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.1 డిగ్రీల నుంచి 22.3 డిగ్రీల మధ్య ఉండవచ్చన్నారు. గాలిలో తేమ ఉదయం వేళల్లో 80 నుంచి 85 శాతం, మధ్యాహ్న సమయాల్లో 87 నుంచి 88 శాతం మధ్యలో ఉంటుందన్నారు. గాలి గంటకు 6 కిలో మీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయని చెప్పారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు. రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని ఏడీఆర్ సూచించారు.


