ఉక్కునగరం: ఆర్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయగీత శుక్రవారం స్టీల్‌సిటీ డిపోను సందర్శించి ఇటీవల వచ్చిన మూడు ఎలక్ట్రిక్ బస్సులను పరిశీలించారు. బస్సుల నిర్వహణ, సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు. మరిన్ని ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై ఉన్నతాధికారులతో సమన్వయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, హౌస్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ మధు, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గంగాధర్, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సుధాబింధు, డిపో మేనేజర్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.


