అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Jul 18 2026 3:47 AM | Updated on Jul 18 2026 3:47 AM

మునగపాక (యలమంచిలి రూరల్‌): యల మంచిలి పట్టణంలో పాతవీధిలో మహిళ అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మృతి చెందింది. యలమంచిలి రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాతవీధికి చెందిన బత్తిన లలిత కుమారి(26) శుక్రవారం ఉదయం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతురాలి తల్లి వరలక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement