ఇంటర్మీడియట్ అనగానే మార్కులు, ర్యాంకుల చుట్టూ తిరిగే ఒక రేస్. ఆ రేస్ పూర్తవ్వగానే ఇంజనీరింగ్‌లో చేరి.. ఓ నాలుగేళ్ల పాటు క్లాసులు అటెండ్ అయి, బోర్డు పైన లెక్చరర్లు రాసిన సబ్జెక్ట్ నోట్ బుక్లలో రాసుకొని, బట్టి పట్టేసి, సెమిస్టర్ పరీక్షలు రాసి, క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఏదో ఒక ఉద్యోగం ప్రయత్నించడం.. మనకు తెలిసిన విద్యావిధానం ఇదే. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. కాలేజీ చదువుకు తోడుగా సరైన స్కిల్స్ కూడా తోడైతే, డిగ్రీ చేతికి వచ్చేదాకా ఆగాల్సిన పనిలేదు. కేవలం పద్దెనిమిదేళ్ల వయసులోనే టెక్నాలజీ ద్వారా వాస్తవ ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారాలు చూపించవచ్చని NIAT అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రాక్టికల్ శిక్షణ పొందుతున్న నేటి ఇంజనీరింగ్ విద్యార్థులు నిరూపిస్తున్నారు.
ఐఐటీలు, ఐఐఎంలు, ఏకంగా ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెషనల్స్‌ను సైతం ఆశ్చర్యపరుస్తూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వీరు సత్తా చాటుతున్నారు. ఇంజనీరింగ్ చదువుకుంటూనే, తమ మొదటి, రెండు సంవత్సరాల్లోనే 'NIAT' అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ సాయంతో ఈ విద్యార్థులు సాధిస్తున్న విజయాలు, వీరు తయారుచేస్తున్న ప్రొడక్ట్స్ చూస్తుంటే.. "మన పిల్లలు కూడా ఇలా ఆలోచించగలరా?" అని ప్రతి తల్లిదండ్రీ ఆశ్చర్యపోవాల్సిందే. ఆ విజయాల వెనుక ఉన్న స్ఫూర్తిదాయకమైన కథలేంటో చూద్దాం..
అంతర్జాతీయ స్థాయిలో 19 ఏళ్ల తెలుగమ్మాయికి అరుదైన గుర్తింపు:
ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికీ 'గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్' ఒక కల. ఇందులో ఎంపికైతే గూగుల్ ప్రాజెక్ట్‌లకే నేరుగా మన కోడ్ రాయవచ్చు. ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్‌కు 131 దేశాల నుంచి 15,245 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, ఫైనల్‌గా ఎంపికైన 1,141 మందిలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న గుత్తా సోనికా చౌదరి నిలిచింది.
"పరీక్షల కోసం బట్టీ పట్టే విధానం నుంచి బయటపడి, నిజమైన ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నాను. NIATతో నాకు లభించిన ప్రాక్టికల్ వాతావరణం, అక్కడి మెంటార్ల గైడెన్స్ నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ ఏజ్ లోన్ ఒక గ్లోబల్ ప్రాజెక్ట్‌కు కంట్రిబ్యూట్ చేసే స్థాయికి రావడం వెనుక ఆ పునాదే కారణం" అని గర్వంగా చెబుతోంది సోనిక.
అంబులెన్స్‌లకు ప్రాణం పోస్తున్న 'ఏఐ' టెక్నాలజీ:
దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన 'ఓపెన్ ఏఐ అకాడమీ బిల్డథాన్'. దేశవ్యాప్తంగా 70 వేల మంది రిజిస్టర్ చేసుకోగా.. ఫస్ట్ ఇయర్ చదువుతున్న NIAT స్టూడెంట్స్ టీమ్ టాప్ ఇన్నోవేటర్స్‌గా నిలిచింది. వీరు అంబులెన్స్‌లకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆటోమేటిక్‌గా దారి క్లియర్ చేసే ఒక అద్భుతమైన 'ఏఐ ట్రాఫిక్ సిస్టమ్'ను (ప్రాజెక్ట్-K) డిజైన్ చేసి ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు.
"ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుపోవడం చూసినప్పుడల్లా ఏదైనా చేయాలనిపించేది. NIAT 5.0 ల్యాబ్స్‌లో మేము టెక్నాలజీ నేర్చుకుంటున్నప్పుడు.. దీన్ని ప్రాక్టికల్‌గా ఆ సమస్య పరిష్కారానికి వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. మా మెంటార్ల సపోర్ట్‌తో ఆ కోడ్ రాసి, సిస్టమ్‌ను డిజైన్ చేశాం." అని ఆ టీమ్ సభ్యులు వివరించారు.
కోమాలో ఉన్న వారి భావోద్వేగాలను తెలుసుకునేలా..
సాధారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సిలబస్ అర్థం చేసుకోవడానికే ఇబ్బంది పడుతుంటారు. కానీ, NIAT విద్యార్థులు 'న్యూరోనెక్సాస్ ఏఐ' పేరుతో హెల్త్‌కేర్‌ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఒకచోట చేర్చారు. ఈ సిస్టమ్ రియల్ టైమ్‌లో ఒక వ్యక్తి మెదడు తరంగాలను రీడ్ చేసి, వాళ్లు ఏ ఎమోషన్ ఫీల్ అవుతున్నారో పసిగడుతుంది. టెక్నాలజీని సామాజిక ప్రయోజనం కోసం ఎలా వాడాలో ఈ యువత నిరూపించింది.
ప్రాణాపాయ పరిస్థితుల్లో మనుషులకు బదులుగా 'హ్యూమనాయిడ్ రోబోట్'
“మనుషులకు హాని కలిగించే ప్రదేశాలకు మనం ఇంకా మనుషులనే ఎందుకు పంపుతున్నాం?" - ఓ విద్యార్థి మదిలో మెదిలిన ఈ చిన్న ప్రశ్నే ఒక అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసింది. కెమికల్ లీక్స్, గ్యాస్ ఛాంబర్లు, కూలిపోయిన భవనాలు, బాంబ్ డిస్పోజల్ సైట్స్ లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనుషులకు బదులుగా పనిచేసే ఒక 'హ్యూమనాయిడ్ రోబోట్'ను NIAT విద్యార్థి ప్రోగ్రామ్ చేశాడు.
ఆర్ఓఎస్, రాస్ప్ బెర్రీ పై సాయంతో రూపొందిన ఈ రోబోట్ ప్రమాదకర ప్రాంతంలో మనిషిలా పనిచేస్తుంటే.. దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తి మాత్రం ఎక్కడో సురక్షితంగా ఉంటాడు.
చదువుకునే వయసులోనే..స్టార్టప్ ఫౌండర్లుగా
పాకెట్ మనీ కోసం అమ్మానాన్నలను అడిగే వయసులో, NIAT స్టూడెంట్స్ ఏకంగా స్టార్టప్‌లకు సీఈవోలుగా మారుతున్నారు. ఇప్పటికే 20కి పైగా స్టార్టప్ లను ప్రారంభించారు. అంతేగాక, ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ఇప్పటికే 2.87 కోట్ల రూపాయల స్టైపెండ్స్ సాధించారు. వీరిలో సచిన్ కీర్తి వాసు అనే విద్యార్థి 'గ్రోవిఫై ఏఐ' అనే స్టార్టప్‌ను ప్రారంభించి, కాల్ సెంటర్ల కోసం ఏఐ వాయిస్ ఏజెంట్‌ను సృష్టించాడు.
హైదరాబాద్ టీ-హబ్‌లో జరిగిన 'బిజ్‌హ్యాక్' ఈవెంట్‌లోను సత్తా చాటాడు. నష్టాల్లో కూరుకుపోయి మూతపడే దశలో ఉన్న ఒక కంపెనీని తిరిగి లాభాల బాట పట్టించే మోడల్‌ను రూపొందించి, 25కి పైగా కాలేజీల నుంచి వచ్చిన 250 మంది పార్టిసిపెంట్స్‌తో పోటీ పడి విజేతగా నిలిచి ఏకంగా లక్ష రూపాయల బహుమతిని గెలుచుకున్నాడు.
"కేవలం ఉద్యోగం కోసమే చదవడం కాకుండా, సొంతంగా ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలని మా NIAT మెంటార్లు మాలో స్ఫూర్తి నింపారు. ఒక ఐడియా వస్తే, దాన్ని వెంటనే ఎలా అమలు చేయాలన్న ప్రాక్టికల్ అప్రోచ్ వల్లే..నేను ఫస్ట్ ఇయర్‌లోనే ఈ స్టార్టప్‌ను ప్రారంభించగలిగాను" అని సచిన్ తన సక్సెస్ జర్నీని పంచుకున్నాడు.
తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇది ఒక మార్గదర్శకం!
విజయాలు సాధించిన ఈ విద్యార్థులందరిలో ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్.. 'ప్రాక్టికల్ లెర్నింగ్'. పుస్తకాల్లోని థియరీని బట్టీ పట్టకుండా, వాస్తవ సమస్యలకు టెక్నాలజీ ద్వారా పరిష్కారాలు కనుక్కోవడం. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టే ప్రతి విద్యార్థీ.. తమ ఫోకస్‌ను కేవలం మార్కుల వైపే కాక, 'నైపుణ్యాల' పైన దృష్టి సారించాలి. విద్యార్థుల్లో ఆ ఇన్నోవేటివ్ ఆలోచనలను రేకెత్తించి, వారికి సరైన మెంటార్‌షిప్ ఇచ్చే NIAT లాంటి ఎకోసిస్టమ్‌ను ఎంచుకున్నప్పుడు.. భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఇలాంటి అద్భుతాలే సృష్టిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు!
For more details: https://rebrand.ly/be7c36


