ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ఆస్పత్రిలో చేపట్టిన భవన నిర్మాణాలు, మరమ్మతు పనుల్లో నాణ్యత లోపించొ ద్దని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. గురువారం స్థా నిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌తో కలిసి రి మ్స్‌లో అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అనంతరం డైరెక్టర్ చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కన్సల్టెంట్ ఇంజినీర్లు నిరంతరం పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. రిమ్స్ నూతన భవనం, ఆస్పత్రి పరిసరాల్లో పారిశుశుద్ధ్యం లోపించకుండా చూడాలని సూచించారు. రోగులు, సహాయకుల సౌకర్యార్థం వాష్ బే సిన్లు, డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని, వాటి వినియో గం, పరిసరాల పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించే ఏజెన్సీలు, సెక్యూరిటీ గార్డులకు జరిమానా విధించాలని ఆదేశించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న సర్వేయర్ గోవింద్‌ను పరామర్శించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఆర్అండ్బీ ఈఈ రమేశ్, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, వైద్యులు, కాంట్రాక్టర్లు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ప్రతినిధులున్నారు.
ఆరుతడి పంటలే సాగు చేయాలి
కైలాస్‌నగర్: యాసంగిలో ఆరుతడి పంటలే సాగు చేయాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ఎల్‌నినో ప్రభావం, అనుసరించాల్సిన పద్ధతులపై అధి కారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో రై తులకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రా మీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఇంకుడు గుంతల నిర్మాణం, పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ వృథాను అరికట్టాలని సూచించారు. స్థానిక సంస్థల అ దనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, డీఏవో రవీందర్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సందీప్‌కుమార్, విద్యుత్‌శాఖ ఎస్ఈ సుభాష్, ము న్సిపల్ కమిషనర్ జగదీశ్ గౌడ్ తదితరులున్నారు.
రీసర్వే ప్రక్రియ పరిశీలన
తాంసి: మండలంలోని బండల్‌నాగాపూర్ గ్రామ శివారులో చేపట్టిన భూ భారతి భూముల రీసర్వే ప్రక్రియను కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఆయ న మాట్లాడుతూ.. సర్వే ద్వారా భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. జిల్లాలోని 78గ్రామాల్లో సర్వే కొనసాగుతుందని పే ర్కొన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ చిత్రు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ప్రభాకర్, తహసీల్దార్ మధుసూదన్, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ప్రాజెక్ట్ ఏఈ హరీశ్, సర్పంచ్ శ్రీకాంత్ తదితరులున్నారు.
క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన
తలమడుగు: మండలంలోని కజ్జర్ల గ్రామ శివారులో పూలు, కూరగాయల తోటలను కలెక్టర్ రాజర్షి షా బైక్‌పై వెళ్లి పరిశీలించి రైతులను అభినందించారు. అయోధ్య నుంచి వచ్చిన ప్రత్యేక ఆర్డర్ల మేరకు అక్కడికి ఫార్వర్డ్ లింకేజీ ద్వారా పూలు ఎగుమతి అవుతుండటం విశేషమన్నారు. తక్కువ పెట్టుబడితో పూలతోటలు సాగు చేస్తే అధిక లాభాలు గడించవచ్చని తెలిపారు. ఎల్‌నినో కారణంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సందీప్, తహిసీల్దార్ రాజ్‌మోహన్, సర్పంచ్ నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మండల ఉద్యానవన అధికారి క్రాంతి తదితరులున్నారు.


