విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలు

Oct 16 2026 7:11 AM | Updated on Oct 16 2026 7:11 AM

ఆదిలాబాద్‌: విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలు కీలకమని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి హుస్సేన్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎరీనా వీఎన్‌ఆర్‌ మైదానంలో ఐదురోజులుగా నిర్వహించిన అండర్‌–14 దసరా కప్‌ క్రికెట్‌ పోటీలు గురువారం ముగియగా, విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్‌లో ఆతిథ్య వీఎన్‌ఆర్‌ అకా డమీ జట్టు మహారాష్ట్రకు చెందిన ఎంసీఏ అకా డమీపై విజయం సాధించింది. తొలుత బ్యా టింగ్‌ చేసిన ఎంసీఏ జట్టు 102 పరుగులు చే యగా, వీఎన్‌ఆర్‌ జట్టు 18 ఓవర్లలో 103 పరుగులు చేసి గెలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడలకు ప్రా ధాన్యత ఇవ్వాలని సూచించారు. గెలుపోటము లను సమానంగా స్వీకరించాలని సూచించా రు. అరుగుల అశోక్‌, ఉమేశ్‌రావు డోలే, నిర్వాహకుడు నరోత్తంరెడ్డి, శిక్షకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement