చీరల పంపిణీ ఏమాయే? | - | Sakshi
Sakshi News home page

చీరల పంపిణీ ఏమాయే?

Oct 16 2026 7:11 AM | Updated on Oct 16 2026 7:11 AM

● జిల్లాకు సగం కూడా చేరుకోని వైనం ● మరో రెండ్రోజుల్లో సద్దుల బతుకమ్మ ● సర్కారు నుంచి ఇంకా రాని స్పష్టత ● కానుక కోసం పేద మహిళల నిరీక్షణ

కై లాస్‌నగర్‌: బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ఇందిర మ్మ చీరల పంపిణీపై స్పష్టత కొరవడింది. ఇప్పటికే జిల్లాకు చేరిన చీరలు గోదాములకే పరిమితమయ్యాయి. ఈ నెల 10న ఎంగిలిపూలతో వేడుకలు ప్రారంభం కాగా, మరో రెండ్రోజుల్లో మహిళలు ఆ నందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలూ జరుపుకోనున్నారు. దసరా సమీపిస్తున్నా ఇంకా చీరల పంపిణీ ప్రారంభించకపోవడంతో నిరుపేద ఆడబిడ్డలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గతంలో వేడుకలకు ముందే..

తెలంగాణలో ఆడబిడ్డలు పూలను పూజిస్తూ ఆనందంగా జరుపుకొనే గొప్ప పండుగ బతుకమ్మ. ఈ సందర్భంగా వారికి కానుక అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. పండుగ సంబరాల ప్రారంభానికి ముందే తెల్లరేషన్‌ కార్డు కలిగి, 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ చీరలు పంపిణీ చేసేది. పేదరికంతో బాధపడుతూ పండుగకు చీరలు కొనలేని మహిళలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం బతుకమ్మ చీరలను కాస్త ఇందిరమ్మ చీరలుగా పేరు మార్చింది. తెలంగాణ ఆడబిడ్డలకు రేవంతన్న కానుకగా పేర్కొంటూ గతేడాది చీరలు అందజేసింది. తొలుత స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకే అందించాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో వారి నుంచి వ్యతిరేక వ్యక్తమవుతోందనే ఉద్దేశంతో అర్హులైన మహిళలందరికీ చీరలు అందజేసింది. గతేడాది ఎస్‌హెచ్‌జీ సభ్యులతో పాటు ఇతర మహిళలకు పండుగ తర్వాతే ఒకే డిజైన్‌ కలిగిన నీలం రంగు చీరలు పంపిణీ చేసింది.

ఇంకా కొన్ని ప్రాంతాలకు చేరుకోని చీరలు

ఇప్పటివరకు చేరిన చీరల్లో నేరడిగొండ మండల సమాఖ్య కార్యాలయంలో 14,766, ఇచ్చోడలో 15,119, గుడిహత్నూర్‌లో 6,033, ఆదిలాబాద్‌లో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోదాములో 8,105, టీటీడీసీలో 17,318 చీరలు భద్రపరిచారు. జైనథ్‌, బేల, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, నార్నూర్‌ మండల సమాఖ్య కార్యాలయాల్లో చీరలను భద్రపర్చేందుకు ఎంపిక చేయగా, ఆయా ప్రాంతాలకు ఇంకా చేరుకోలేదు. సద్దుల బతుకమ్మ సంబరాలు, దసరా పండుగ సమీపిస్తున్నా వీటి పంపిణీ తేదీ ఖరారు కాకపోవడంతో చీరలు గోదాములకే పరిమితమయ్యాయి. నిరుపేద మహిళలకు బతుకమ్మ పండుగకు చీరలు అందే పరిస్థితి కనిపించడం లేదు.

జిల్లాలోని ఎస్‌హెచ్‌జీలు 10,990

గ్రామైక్య సంఘాలు 554

సంఘాల్లోని సభ్యులు 1,26,052

జిల్లాకు అవసరమైన చీరలు 1,54,778

ఇప్పటివరకు జిల్లాకు చేరినవి 61,341

ఇంకా రావాల్సినవి 93,437

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement