సీపీఐ జిల్లా కమిటీ రద్దు | - | Sakshi
Sakshi News home page

సీపీఐ జిల్లా కమిటీ రద్దు

Oct 16 2026 7:11 AM | Updated on Oct 16 2026 7:11 AM

బోథ్‌: రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు సీపీ ఐ జిల్లా కమిటీని రద్దు చేసినట్లు పార్టీ నాయకుడు ఎస్‌.విలాస్‌ వెల్లడించారు. జిల్లా కార్యదర్శి బాధ్యతల నుంచి ముడుపు ప్రభాకర్‌రెడ్డిని తప్పించి, జిల్లా కన్వీనర్‌గా తనను నియమించినట్లు తెలిపారు. ఈ నెల 25, 26, 27తేదీల్లో ని ర్వహించనున్న సమావేశాల అనంతరం నూత న జిల్లా కమిటీ, జిల్లా కార్యదర్శిని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. బోథ్‌లోని శంకర్‌రావు భ వన్‌లోగల సీపీఐ కార్యాలయంలో గురువారం భారతాల గోవర్ధన్‌ అధ్యక్షతన నియోజకవర్గ, మండల స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం, అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విలాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సహా య కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జిల్లా ఇన్‌చార్జి కలవేణ శంకర్‌, బోథ్‌ మండల కార్యదర్శి నరేశ్‌, ఏఐఎస్‌ ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మున్సిఫ్‌, కుచలాపూర్‌ కార్యదర్శి ఎస్‌.దాస్‌, భోజన్న ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement