కరీంనగర్కల్చరల్: కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయంలో లలితా త్రిపుర సుందరీ దేవిని పలువురు రాజకీయ నేతలు, అధికారులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నిర్మల్ జిల్లా ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ చిత్ర మిశ్రా, నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావు, భైంసా మున్సిపల్ చైర్మన్ తుమ్మోళ్ల దత్తాత్రి అమ్మవారిని దర్శించుకున్నారు.


