మహిళను వేధించిన ఒకరి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళను వేధించిన ఒకరి రిమాండ్‌

Oct 16 2026 7:47 AM | Updated on Oct 16 2026 7:47 AM

● సౌదీలో చిక్కుకున్న ఖానాపూర్‌ వాసి ● ఆందోళనలో కుటుంబ సభ్యులు

ఆదిలాబాద్‌టౌన్‌: మహిళను వేధించిన ఒకరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు. వికలాంగుల కాలనీకి చెందిన షేక్‌ ఇర్షద్‌ హుస్సేన్‌ ఓ మహిళను ఇబ్బందులకు గురిచేయగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో

ఒకరు మృతి

మామడ: మండలంలోని బండల్‌ ఖానాపూర్‌ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై హనుమాండ్లు తెలిపారు. పెంబి మండలం అంకెన గ్రామానికి చెందిన లావుడ్యా సంతోష్‌ (43) జగిత్యాల జిల్లా వేములకుర్తిలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. బండల్‌ ఖానాపూర్‌ సమీపంలో వాహనం అదుపుతప్పి కిందపడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై సంఘటన స్థలాన్ని సందర్శించి మృతుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

ఐదేళ్లుగా

కానరాని ఆచూకీ

ఖానాపూర్‌: ఉపాధి కోసం ఐదేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లిన ఖానాపూర్‌ మండలంలోని గోడలపంపు గ్రామానికి చెందిన సింగం రాజేశ్వర్‌ గౌడ్‌ ఆచూకీ కనుగొని, స్వదేశానికి రప్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్‌ రాథోడ్‌ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని కేంద్ర మంత్రి నివాసంలో రాజేశ్వర్‌ గౌడ్‌ కుటుంబ సభ్యులతో కలిసి విన్నవించారు. కుటుంబ పోషణ కోసం రాజేశ్వర్‌ గౌడ్‌ అప్పులు చేసి 2019లో సౌదీ అరేబియాకు వెళ్లారు. మొదట రెండేళ్లపాటు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడినా 2021 నుంచి పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు. కుటుంబ పెద్ద ఆచూకీ తెలియక భార్య రజిత, ఇద్దరు కుమారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement