రేపే గంగనీళ్ల జాతర | - | Sakshi
Sakshi News home page

రేపే గంగనీళ్ల జాతర

Oct 16 2026 7:47 AM | Updated on Oct 16 2026 7:47 AM

● రెండు రోజులపాటు నిర్వహణ ● అధికసంఖ్యలో తరలిరానున్న భక్తజనం

సారంగపూర్‌: ఉత్తర తెలంగాణ ప్రజల పాలిట వరప్రదాయినిగా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ సహ్యాద్రి పర్వతశ్రేణిని ఆనుకుని వెలిసిన శ్రీఅడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతరకు వేళైంది. ఏటా మహాలయ అమావాస్య అనంతరం వచ్చే శని, ఆదివారాల్లో జాతర నిర్వహించడం దశాబ్ధాలుగా వస్తున్న ఆనవాయితీ. ఈ నెల 17, 18 తేదీల్లో జరుగనున్న జాతరకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ జిల్లా ల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తారు.

అలంకరణ...అభిషేకం

ఆదివారం సాయంత్రానికి ఆభరణాలను ఆలయానికి తరలించిన అనంతరం సేవాదారులు, ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారి ఆలయాన్ని నదీ జలాలతో శుద్ధి చేస్తారు. అమ్మవారికి ఆభరణాలు అలంకరించి మహా హారతి నిర్వహిస్తారు. ఆలయ మండపంలో ప్రత్యేక పూజలు చేసి దర్శనానికి అనుమతిస్తారు. దీంతో జాతర ముగియనున్నట్లు ఆల య ఈవో భూమయ్య తెలిపారు. అడెల్లి మహాపోచ మ్మ ఆలయానికి నిర్మల్‌, భైంసా డిపోల నుంచి ఆర్టీ సీ ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు పేర్కొన్నారు.

జాతర జరిగేదిలా..

గంగనీళ్ల మహాజాతర అడెల్లి గ్రామం మీదుగా ప్రా రంభమవుతుంది. గ్రామంలోని పోచమ్మ ఆలయం నుంచి ఆభరణాలను మూటగట్టుకుని అడెల్లి మహా పోచమ్మ ఆలయానికి తరలిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ సేవాదారులు ఆభరణాలు తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అనంతరం భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆభరణాలను సారంగాపూర్‌, యాకర్‌పల్లి, వంజర్‌, ప్యారమూర్‌ గ్రామాల మీదుగా దిలావర్‌పూర్‌ మండలం సాంఘ్వి గ్రామంలోని గోదావరి నదీ తీరానికి కాలినడకన తరలివెళ్తారు. సాంఘ్వీ గ్రామంలో గల పోచమ్మ ఆలయంలో ఆభరణాలను ఉంచి అక్కడే రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు తెల్లవారు జామున గోదావరిలో ఆభరణాలను శుద్ధి చేస్తారు. ప్రత్యేక పూజల అనంతరం ఆభరణాలతో పాటు గోదావరి జలాలతో కాలినడకన తిరుగుపయనం అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement