విన్నపాలు.. ఎన్నిసార్లు? | - | Sakshi
Sakshi News home page

విన్నపాలు.. ఎన్నిసార్లు?

Oct 16 2026 7:11 AM | Updated on Oct 16 2026 7:11 AM

● ప్రజావాణి అర్జీల పరిష్కారం అంతంతే.. ● 30 రోజులైనా పెండింగ్‌లోనే అధికం ● బాధితులకు తప్పని ఎదురుచూపులు ● మళ్లీ మళ్లీ దరఖాస్తులు ఇస్తున్న వైనం

కైలాస్‌నగర్‌: ప్రజా సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ జిల్లాలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. జిల్లా నలుమూలల నుంచి బాధితులు అధికసంఖ్యలో వస్తున్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశిస్తున్నా పలు శాఖలు పట్టించుకోవడం లేదు. దీంతో వందలాది అర్జీలు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. 30రోజుల్లోపు దరఖాస్తు పరిష్కరించాల్సి ఉండగా గడువు దాటినా పెండింగ్‌లో ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.

పరిష్కారంలో తీవ్ర జాప్యం

భూమి, విద్యుత్‌, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని, రోడ్లు నిర్మించాలని, పెన్షన్లు, ఇందిరమ్మ ఇ ళ్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని, భూ కబ్జాలు, ఆక్రమణలను అరికట్టాలని, సంక్షేమ, అభివృద్ధి పఽథకాలు వర్తింపజేయాలని బాధితులు ప్రజావా ణిని ఆశ్రయిస్తున్నారు. వ్యయ, ప్రయాసలకోర్చి క లెక్టరేట్‌కు వచ్చి అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. అర్జీలను ఉన్నతాధికారులు సంబంఽధిత అధికారులకు పంపిస్తున్నారు. 01.12.2023 నుంచి 11.10.2026 వరకు 1,157 అర్జీలు అందాయి. ఇందులో 927 దరఖాస్తులు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో అర్జీల పరిష్కారంలో తీవ్రజాప్యం జరుగుతోందనే ఆవేదన దరఖాస్తుదారుల్లో వ్యక్తమవుతోంది.

కొరవడిన సమన్వయం

ప్రజావాణికి అందిన అర్జీలను 30రోజుల్లోపే పరిష్కరించేలా చూడాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారుల ను ప్రతీ వారం ఆదేశిస్తున్నా పలు శాఖల అధికారులు లెక్క చేయడం లేదు. సంబంధిత అధికారులు వాటిని ఆయా శాఖలకు పంపిస్తున్నారు. కానీ, వాటిపై ఏ మేరకు చర్యలు తీసుకున్నారు.. సమస్య పరిష్కారానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది.. పెండింగ్‌లో ఉండటానికి కారణాలేమిటి.. అనే అంశాలపై ఆరా తీయడంలేదు. శాఖల మధ్య సమన్వయం లేకనే ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు న్నాయి. దీంతో బాధితులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. పలు సమస్యలపై పదేపదే వచ్చి అర్జీలు అందజేసినా పరిష్కారం లభించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్జీ ఇచ్చిన వెంటనే సమస్య పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేసే అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మండలస్థాయిలోనూ అదే పరిస్థితి

బాఽధితుల వ్యయప్రయాసలను తగ్గించడంతోపా టు స్థానికంగానే సమస్యలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో మండల స్థాయిలోనూ ఇటీవల ప్రజావాణికి శ్రీకారం చుట్టారు. కానీ, పలువురు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదనే ఆరోపణలున్నాయి. మండల స్థాయిలో సమస్యలు పరి ష్కారం కాకపోవడంతోనే బాధితులు జిల్లా ఉన్నతాధికారుల వద్దకు వెళ్తారు. ఇప్పటివరకు 1,110 అర్జీలు అందాయి. అధికారులు ఇందులో 754 పరిష్కరించగా, మరో 354 పెండింగ్‌లో ఉన్నాయి. 30రోజుల గడువు దాటిన తర్వాత ఇంకా 235 పెండింగ్‌లో ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement