● చదువు మానేస్తున్న విద్యార్థులు ● జిల్లాలో ఆగని డ్రాపౌట్స్‌ ● ఫలితమివ్వని స్పెషల్‌డ్రైవ్‌లు ● స్పష్టం చేస్తున్న గణాంకాలు | - | Sakshi
Sakshi News home page

● చదువు మానేస్తున్న విద్యార్థులు ● జిల్లాలో ఆగని డ్రాపౌట్స్‌ ● ఫలితమివ్వని స్పెషల్‌డ్రైవ్‌లు ● స్పష్టం చేస్తున్న గణాంకాలు

Aug 5 2026 1:47 AM | Updated on Aug 5 2026 1:47 AM

● చదువు మానేస్తున్న విద్యార్థులు ● జిల్లాలో ఆగని డ్రాపౌట్స్‌ ● ఫలితమివ్వని స్పెషల్‌డ్రైవ్‌లు ● స్పష్టం చేస్తున్న గణాంకాలు

ఆదిలాబాద్‌టౌన్‌: తరగతి గదిలో గడపాల్సిన బా ల్యం ఇంకా చెత్తకుప్పలు, హోటళ్లు, ఇటుక బట్టీలు, దుకాణాలకు పరిమితమవుతున్న పరిస్థితి. మరి కొందరు భిక్షాటన చేస్తూ దర్శనిమిస్తుండగా.. ఇంకొందరు పశువులు కాస్తూ తమ భవిష్యత్తును అంధకారంగా మార్చుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా డ్రా పౌట్ల సంఖ్య ఏటా వందల్లో ఉంటుండడం పరిస్థితి కి అద్దం పడుతోంది. విద్య, కార్మికశాఖలు ప్రతి సంవత్సరం స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా చిన్నారులు ఇంకా పూర్తిస్థాయిలో బడిబాట పట్టకపోవడం గమనార్హం. మరోవైపు ఆయా శాఖలు కాకిలెక్కలతో కాలం వెల్లదీస్తున్నాయనే అపవాదు లేకపోలేదు.

బడికి దూరమవుతున్న చిన్నారులు..

జిల్లాలో పాఠశాలలకు దూరమవుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు, చిన్న వయస్సులోనే వి వాహం, వలసలు, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి కారణాలతో పలువురు విద్యార్థులు చదువును మఽ ద్యలోనే నిలిపివేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, ఏ జెన్సీ మండలాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తోంది. కొంత మంది విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పనికి వెళ్లడం, మరికొందరు కుటుంబ బాధ్యతల కారణంగా చదువు మానేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు డ్రాపౌట్‌లను తిరిగి చేర్పించేందుకు చ ర్యలు చేపడుతున్నా అవి సత్ఫలితాలు ఇవ్వడం లే దు. గతేడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌లో నిర్వహించిన బడిబయట చిన్నారుల సర్వేలో జిల్లాలో 250 మంది బాలురు, 236 మంది బాలికలు ఉన్నట్లు అధి కారులు పేర్కొన్నారు. అంతకముందు రెండేళ్లలో నూ దాదాపు ఇంతే మంది ఉండడం గమనార్హం.

నామ్‌కే వాస్తేగా సర్వే..

డ్రాపౌట్‌ పిల్లల సర్వేను జిల్లాలో సీఆర్పీలు కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. వీరు మొత్తం 57 మంది ఉండగా ఒక్కొక్కరికి 25 నుంచి 30 పాఠశాలలు ఉన్నాయి. ఇదే సమయంలో వీరు పుస్తకాలు, యూనిఫాం, నోట్‌బుక్‌లను పాఠశాలలకు సరఫరా చేయడం, సమాచా రం సేకరించడం, తదితర పనులు చేస్తున్నా రు. దీంతో డ్రాపౌట్‌ సర్వే పూర్తి స్థాయిలో జరగడం లేదని తెలుస్తోంది. కేటాయించిన సమయం కూడా సరిపోకపోవడంతో కొన్ని గ్రామాల సర్వే చేపట్టి లెక్కలు చూపిస్తున్నారు. విషయం అధికారులకు సైతం తెలిసినప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ మంది డ్రాపౌట్‌గా ఉన్నట్లు చూపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, వా రిచ్చిన లెక్కలతోనే సరిపెడుతున్నట్లు సమాచారం. జిల్లాలో అత్యధికంగా ఆదిలాబాద్‌ అర్బన్‌, ఉట్నూర్‌, బోథ్‌, ఆదిలాబాద్‌రూరల్‌, నేరడిగొండ,భీంపూర్‌లో 40నుంచి 30మంది వరకు, అత్యల్పంగా మావల, నార్నూర్‌, సిరి కొండ, ఇంద్రవెల్లి ఉన్నట్లు వారి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో వీరి లెక్కలకు పొంతన లేకుండా కనిపిస్తోంది. ఇంకా చాలామంది డ్రాపౌట్ల పేర్లు పాఠశాలల్లో కొనసాగున్నాయి. వాటిని తొలగిస్తే తమ పోస్టులు తగ్గుతాయని భావించిన ఉపాధ్యాయులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

బడి బయట పిల్లలు

520

492

486

2025–26

2024–25

2023–24

విద్యా సంవత్సరం

బడిలో చేర్పిస్తున్నాం..

జిల్లాలో గతేడాది నిర్వహించిన బడిబయట సర్వేలో 486 మందిని గుర్తించాం. వీరిలో 250 మంది బాలురు, 236 మంది బాలికలు ఉన్నారు. ఇందులో 211 మంది పిల్లల్ని వివిధ పాఠశాలల్లో చేర్పించాం. మిగతా 275 మంది ఇతర రాష్ట్రాలు, సరిహద్దు గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో డ్రాపౌట్లు లేరు. తల్లిదండ్రులు తమ పిల్ల ల్ని సక్రమంగా బడికి పంపి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలి.

– లక్ష్మణ్‌, సెక్టోరియల్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement